Sunday, April 28, 2024

తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని ప‌ర్మిష‌న్లు ఉన్న‌య్‌.. ఏపీ అభ్యంతరాలను తిరస్కరించిన జీఆర్‌ఎంబీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గోదావరి జలాలు, ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేవనెత్తిన పలు అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారని తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై హైదరాబాద్‌లోని జలసౌదలో 13వ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ ) సమావేశం జరిగింది. అనంతరం రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ… బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు డైవర్ట్‌ చేస్తోందని.. అందులో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలని పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి #హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై, ఆంధ్రప్రదెశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌#హౌస్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపైనా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే సీడబ్ల్యూసీకి నివేదక పంపించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఏపీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని , ఆ అభ్యంతరాలును జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించినట్లు చెప్పారు. గెజిట్‌ నోటిఫికేష న్‌ సబ్‌ కమిటీ ద్వారా వివరాలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ అన్ని అంశాలను నోట్‌ చేసుకున్నారని వివరించారు. తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దెశ్‌పాండే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవ#హర్‌రెడ్డి, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement