Saturday, May 4, 2024

TS | విశ్వాసం అంతా కేపీవీ పైనే.. మూడోసారి వరించిన ఎమ్మెల్యే టికెట్

కుత్బుల్లాపూర్ (ప్రభ న్యూస్) : సీఎం కేసీఆర్ చూపిన బాట, చేసిన మార్గదర్శకత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 9 ఏళ్ళలో ఊహించని అభివృద్దే ప్రజా ఆశీర్వాదమై ప్రజల్లో గుడుకట్టుకోగా విశ్రమించని, మడమ తిప్పని నేతగా ఎమ్మెల్యే కేపి వివేకానంద దినదినాభివృద్ది, పరివర్తనం చెంది ప్రజలకు అత్యంత మెరుగైన పాలన అందించాడు.

పలితంగా బీఆర్ ఎస్ చేపట్టిన అన్ని సర్వేల్లో కేపి వివేకానంద గౌడ్ కే ప్రజలు పట్టం కట్టారు.. మా ఎమ్మెల్యే గా వివేకానందుడే కావాలని తేల్చడంతో అధినేత విశ్వాసాన్ని కేపి వివేక్ చురగొన్నాడు. తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి తిరిగి వివేకానంద గౌడ్ ను ప్రకటిస్తూ కేసీఆర్ ప్రకటించారు. కేపి వివేకానంద గౌడ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి ప్రజా ఆశీర్వాదం తో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నుండి మూడో సారి అవకాశం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్( టిఆర్ఎస్) నుండి పోటీ చేసి ఓటమి పాలైన కేపి వివేకానంద గౌడ్ అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2016లో నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో బీఆర్ ఎస్ నుండి పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అధినేత కెసిఆర్ విశ్వసాన్ని చూరగొన్న కెపివి మరోమారు బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

అభివృద్ధి-సంక్షేమమే మా నినాదం ఎమ్మెల్యే కేపి
2014 మరియు 2018 మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఆచరణకు సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల అంచనాలకు అందని విధంగా బ్రహ్మాండమైన విధంగా సుభిక్ష పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథనా నిలిచిన ఘనత సి ఎం కేసీఆర్ కె దక్కుతుంది. ఆయన చూపిన బాటలో, సూచించిన మార్గదర్శకత్వంలో పయనిస్తూ గడప, గడపకు సంక్షేమం- అభివృద్ధి అనే నినాదంతో ముందుకు పోయి అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం పొందాము. పలితంగా ప్రజా ఆశీర్వాదం సి ఎం కేసీఆర్ ఆశీస్సులతో మరో మారు ఎమ్మెల్యే టికెట్ వరించింది. 100 రోజుల ప్రగతి యాత్ర తో నియోజకవర్గంలో ఇంకా మిగిలిన అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేసి మరోమారు ప్రజా రెఫరెండం కు వెళ్తాము. చేసిన అభివృద్ధి- ప్రజలకు అందిన సంక్షేమ పతకాలే తిరిగి మా విజయానికి దోహదం చేస్తాయి. హ్యాట్రిక్ విజయాన్ని కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామనే నమ్మకం ఉంది.

కుత్బుల్లాపూర్ లో సంబరాలు
నియోజకవర్గ పరిధిలోని రెండు సర్కిళ్లు, రెండు మున్సిపాలిటీలు, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ అద్యక్షుల ఆధ్వర్యంలో సురారం కట్టమైసమ్మ నుండి చింతల్ పార్టీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు, పలు కాలనీ సంఘాలు, ఎమ్మెల్యే అభిమానుల ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకుని ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. జై కేపి జై జై కేపి అంటూ నినాదాలు చేశారు. కాగా కొందరు అభిమానులు ఫ్యూచర్ మినిష్టర్ వివేక్ సాబ్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement