Sunday, May 5, 2024

TS | ధైర్యానికి నిదర్శనం సీఎం కేసీఆర్‌.. అంద‌రినీ గెలిపించుకుంటాం: మంత్రి గంగుల

తెలంగాణ‌లోని మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 115 స్థానాలకు ఒకే విడత అభ్య‌ర్థుల‌ను కేటాయించడం సీఎం కేసీఆర్ ధైర్యానికి నిదర్శనం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. సోమవారం మీడియాతో మాట్లాడుతూ త‌మ‌పై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13కు 13 గెలిచేందుకునేలా శాయశక్తులా పని చేస్తామన్నారు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారని తెలిపారు.

మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. టికెట్ కోసం ఆశపెట్టుకుని దక్కనివాళ్లను కూడా అక్కున చేర్చుకుంటామన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలన్నారు. మళ్లీ గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement