Monday, May 6, 2024

TS | ముదిరాజ్ లకు దక్కని ప్రాధాన్యం.. అయిదు స్థానాలు డిమాండ్ చేసినా నో చాన్స్​!

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్): రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ లకు బీఆర్ ఎస్ పార్టీలో ఈసారి కూడా అన్యాయం జరిగింది. బీఆర్ ఎస్ పార్టీ నుండి ఈ సారి 5 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కొన్ని రోజులుగా ముదిరాజ్ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పటాన్ చెరు స్థానాన్ని బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్క్ ల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఇవ్వాల (సోమవారం) సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఒక్కరికంటే ఒక్కరు కూడా ముదిరాజ్ బిడ్డకు టికెట్ దక్కలేదు.

దీంతో ముదిరాజ్ లు చిన్నబోయారు. కనీసం నీలం మధు ముదిరాజ్ కైనా టికెట్ వస్తుందని అంతా ఆశించినప్పటికీ దక్కకపోవడంతో నిరాశ చెందారు. పటాన్ చెరులో పార్టీలు, కుల-మతాలకతీతంగా నీలం మధుకు అంత్యంత ఆదరణ ఉండటంతో అన్ని వర్గాలవారు మధు గృహానికి చేరుకుని ఆయనకు ధైర్యం నూరిపోశారు.. మేమున్నాం మీ వెంట అంటూ ముందడుగు వేయమని స్పష్టం చేశారు. తరలివచ్చిన మద్దతుదారులు-అభిమానులతో చిట్క్ ల్ జన సంద్రమైంది.

ముదిరాజలకు దక్కని ప్రాధాన్యం

అధికార పార్టీ బీఆర్ ఎస్ నుండి చట్టసభల్లో అడుగుపెడుదామని ఆశించిన ముదిరాజ్ కులస్తులకు ఈ సారి కూడా మొండి చేయి ఎదురైంది. బీఆర్ ఎస్ పాలనలో ముదిరాజ్ కులస్తులకు ప్రాధాన్యం, సంక్షేమం- అభివృద్ధి ఫలాలు దక్కుతున్నపటికి వారికి చట్ట సభల్లో ప్రవేశించే అర్హత లేకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక  ముదిరాజ్ లకు చట్ట సభల్లో ప్రవేశించే అవకాశం లేకుండా పోతోందని, బీఆర్ ఎస్ పార్టీ ముదిరాజ్ లను గుర్తించడం లేదనే మనోవేదన చెందుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లను గుర్తించి వారిని చట్ట సభల్లో ప్రాతినిధ్యం దక్కే విధంగా సీఎం కేసీఆర్ ఆశీర్వదించాలని, రాష్ట్ర వ్యాప్తంగా కనీసం అయిదుగురు అభ్యర్థులను బీఆర్ ఎస్ నుండి  ముదిరాజ్ కులస్తులను ప్రకటించాలని డిమాండ్ చేయడంతో పాటు తీర్మానించారు. అయినప్ప టికీ సి ఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఒక్కరంటే ఒక్కరికి కూడా బీఆర్ ఎస్ నుండి టికెట్ దక్కకపోవడంతో ముదిరాజ్ కులస్తులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు.

- Advertisement -

తడాఖా చూపుతాం

అన్ని కులాలకు ప్రాధాన్యతా క్రమంలో అసెంబ్లీ సీట్లను కేటాయించిన సీఎం కేసీఆర్ ముదిరాజ్ లను చిన్నచూపు చూశారని ముదిరాజ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు సీట్లు డిమాండ్ చేస్తే కనీసం రెండు టికెట్లు అయినా కేసీఆర్ ఇస్తాడాని ఆశపడ్డామని, కానీ ఆశలు అడిఆశలు అయ్యాయి తప్పితే ఇంకోటి లేదని ఆవేదనకు గురయ్యారు. ముదిరాజ్ కులస్తులంతా ఏక తాటిపై ఉంది వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు తడాఖా చూపిస్తామని ముదిరాజులు   డిమాండ్ చేశారు.

ప్రజాభీష్టం మేరకే భవిష్యత్ కార్య చరణ: నీలం మధు ముదిరాజ్, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు

త్వరలో నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదం కోసం భారీ సభ నిర్వహిస్తాం. ఎన్ ఎం ఆర్ యువజన ఈ సభ ఏర్పాట్లు చేస్తోంది. ముదిరాజ్ లతో పాటు అన్ని కులాలు, మతాల ఐక్యతను కూడకట్టుకుని వారి అభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. కచ్చితంగా పఠాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోసం జరిగే పోటీలో భరీలో ఉంటా.

Advertisement

తాజా వార్తలు

Advertisement