Friday, May 3, 2024

Alampur – ఏసీబీ కి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్

గద్వాల (ప్రతినిధి)జనవరి 29 (ప్రభ న్యూస్)జోగులాంబ గద్వాల జిల్లా:అలంపూర్ నియోజకవర్గం,అయిజ పట్టణంలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జీవరత్నం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

అయిజ పట్టణంలో ఒక ఇంటి స్థలంలో కరెంట్ స్తంభం తీసేవేయడానికి ఇంటి యజమాని వీరేష చారి నుండి 20 వీలు రూపాయలు లంచం డిమాండ్ చేయగా, వీరేష చారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం 20 వేల రూపాయలను వీరేష చారి నుంచి లైన్ ఇన్స్పెక్టర్ జీవరత్నం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement