Monday, May 20, 2024

TS | ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ బస్సు యాత్రలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 10కిపైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా ముందుకు కదులుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ క్యాడర్‌ను సన్నద్ధం చేయడంతోపాటు వారిలో మరింత ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 10 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించనుంది.

పార్లమెంట్‌ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను, మోదీ నాయకత్వాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో బస్సు యాత్రలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెబుతున్నారు. బస్సు యాత్రలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ముఖ్యనేతలు సారథ్యం వహించనున్నారు. దాదాపు పది రోజులపాటు పాటు జరిగే బస్సు యాత్రల్లో బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఎంపీ లక్ష్మణ్‌ తదితర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10న భువనగిరి ఎంపీ నియోజకవర్గంలోని యాదాద్రి ఆలయం నుంచి బస్సులు యాత్రలను ప్రారంభించిన 19న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ముగించాలని పార్టీ నిర్ణయించింది.

- Advertisement -

బీజేపీపై గతంలో ఎన్నడూ లేనంత సానుకూలత…

ప్రస్తుతం దేశంతోపాటు తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత సానుకూల పవనాలు బీజేపీకి అనుకూలంగా వీస్తున్నాయని కాషాయదళ రాష్ట్ర సారథి కిషన్‌రెడ్డి చెెప్పారు. తెలంగాణ ప్రజలు మోదీ పాలన మళ్లిd రావాలని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. బస్సు యాత్రల సన్నాహక సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్‌, బీజేపీని విమర్శించి ప్రజలను ఓట్లు అడగాల్సిన అవసరం లేదని, ఇప్పటికే రాష్ట్రంలోని 30శాతం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించారని స్పష్టం చేశారు.

2019లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుందని, ఈసారి డబుల్‌ డిజిట్‌లో ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అవసరం లేదని, ఆ పార్టీ ఎంపీ సీట్లను గెలిచినా, గెలవకపోయినా ఢిల్లిdలో చేసేదేమీ ఉండదని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుధ్ది లేదని, హామీల అమలుకు 100 రోజుల సమయం అడుగుతున్నారని, ఆ తర్వాత హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఎంఐఎం రాయబారాలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ,రాహుల్‌గంధీ, కాంగ్రెస్‌తో లాభం లేదని ప్రజలు బావిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement