Monday, April 29, 2024

nirmal : ఆర్జీయూకేటీ బాసరలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ పరిపాలన భవన ఆవరణలో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తో కలిసి వైస్ ఛాన్స్ ల‌ర్ ప్రొఫెసర్ వెంకటరమణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ ల‌ర్ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ… మన ఆర్జీయూకేటీ మన బాధ్యత నినాదంతో ఆర్జీయూకేటీ బాసరలో పలు కార్యక్రమాలు చేపట్టామని, నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వాతావరణ మార్పులు ఇప్పుడు మానవ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని, ప్రధానంగా మానవ కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.

ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరువు సముద్ర మట్టాలు పెరగడం జీవజాతులు సామూహికంగా అంతం కావడం అనే విపత్కర పరిస్థితులను మానవుడు అనుభవించాల్సి వస్తుందన్నారు. 19వ శతాబ్దం కంటే ప్రపంచం ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిగా ఉంది. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ పరిమాణం 50 శాతం పెరిగిందన్నారు. భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ నాలుగు డిగ్రీ సెంటీమీటర్లు మించిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వినాశకరమైన వడగాలిపులతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులుగా మారతారని హెచ్చరిస్తున్నారు. అందుచేత సాధారణ ప్రజలు కూడా తమ జీవన విధానంలో చిన్నచిన్న మార్పులు తీసుకురావడం వల్ల వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిమితం చేయవచ్చని వైస్ ఛాన్స్ ల‌ర్ ప్రొఫెసర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బయోసైన్స్ డిపార్ట్ మెంట్ అధ్యాపకులు, అధ్యాపకులు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement