బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో ఉగాది నుండి ప్రారంభించనున్న అన్నధాన కార్యక్రమం కోసం నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామ వాస్తవ్యులు కొండ సరిత-రమేష్‌గౌడ్ దంపతులు తమవంతు సహాయంగా 25 కేజీల బియ్యం బస్తాను అందజేశారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, దాతలు కొండ రమేష్ గౌడ్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి తమవంతుగా 25 కేజీల బియ్యం అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాగే మరింత మంది దాతలు జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు గాజుల కైలాష్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement