Sunday, April 28, 2024

కౌలురైతు కుటుంబం బలవర్మరణం..

కాసిపేట : ” అప్పులభాదకు ఆత్మ హత్య చెసుకుంటున్నాం.పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం లాసు వచ్చింది.అందులో కూతురు పెల్లి చేశాను.అప్పులు ఎక్కువై అందరం ఆత్మహత్య చేసుకుంటున్నాం.నేను ఒక్కడిని లేకపోతే నా పిల్లలు, నా భార్య బతుకలేరు. మా ఆత్మహత్యలకు ఎవరు కారణం కాదు. కౌలు రైతు పరిస్థితింతే…..” అని సుసైడ్‌నోట్‌ తన ఆవేదనను తెలియచేస్తూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతు కుటుంబ సభ్యుల సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. కాసిపేట మండలం మల్కేపెల్లి గ్రామానికి చెందిన జంజిరాల రమేష్‌ (40) అనే కౌలురైతు కుటుంబం బుదవారం అర్ధరాత్రిదాటాక ఇంట్లో ఉరివేసుకుని కుటుంబం బలవన్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం, రోజు తెలవారకముందు అందరికంటే ముందే రమేష్‌ బార్య పద్మ(35) ఇంటిపనలు చేసేదని, గురువారం తెలవారిన ఇంటి నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్కింటి వాల్లు రమేష్‌ ఇంటి తలుపు తెరిచి చూడగా తాడుతో ఉరివేసుకుని మృతి చెందివున్న పద్మనుచూసి వాడలో అందరికి చెప్పగా, అందరు ఇంట్లోకి వెల్లి పరిశీలించగా పద్మ ఉరివేసుకుని వున్న గదిలో నేలపై విగతజీవిగా పడివున్న వారి కూతురు సౌమ్య(19),
మరో గదిలో రమేష్‌ తాడుతో ఉరివేసుకుని మృతి చేందివుండగా పక్కనే మంచంలో వారి కుమారుడు అక్షయ్‌(17) అపస్మారక పరిస్థితిలో వుండడం గమనించిన స్థానికులు గొల్లు మన్నారు. ఈ విషయాన్ని దేవాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పులే మరణానికి కారణం. తమ చావుకు అప్పులే కారణమని తెలియచేస్తూ వున్న సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కౌలుకు భూములు తీసుకుని వ్యవసాయం చేసే రమేష్‌ గత రెండేల్లుగా అనుకున్నమేర పంట దిగుబడులు లేక పెట్టుబడులు రాక మరింత అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. గత ఎడాది తన కూతురు సౌమ్య వివాహం చేసిన అప్పులు, వ్యవసాయానికి చేసిన అప్పులు దాదాపు 16 లక్షల రూపాయల వరకు వున్నట్టు సుసైడ్‌నోట్‌ పేర్కోన్నాడు. వ్యవసాయ కూలీలు, పెట్టుబడులు పోనూ ఈ ఏడాది సుమారు మూడు లక్షలు వస్తే అప్పులు ఇచ్చినవారికి చెల్లించినట్టు అందులో పేర్కోన్నాడు. దాంతో డబ్బులు లేకపోవడం, మరికొంత మంది అప్పిచ్చినవారికి ఈ నెల 25 అనగా గురువారం డబ్బులు చెల్లించేందుకు సమయం ఇవ్వడంతో చేతిలో వారికి ఏమి సమాదానం చేప్పాలనే భాదతో ఈ ఘటనకు పాల్పడినట్టు సుసైడ్‌నోట్‌లో తెలియచేశాడు. ఒక ఎకరం భూమి వున్న దాన్ని అమ్ముకుని లేదా పది లక్షలు వున్న బతికేవాల్లం, మధ్యతరగతి బతుకులింతే, ఇజ్జత్‌ ఎక్కువ, అప్పుల కోసం నాలుగు ప్రాణాలు పోవడం జరిగింది. నన్ను తిట్టుకోకండి… అంటూ సుసైడ్‌నోట్‌లో వేదనతో రాసిన మాటలు గ్రామస్థులను కంటతడిపెట్టించాయి. ముందు పిల్లలు తర్వాతే రమేష్‌ దంపతులు పదవ తరగతి చదువుకుంటున్న అక్షయ్‌, గత ఏడాది వివాహమై గర్భంతో వున్న కూతురు సౌమ్య మూడు రోజుల కిందే ఇక్కడికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. అయితే ముందుగా పిల్లలను తాడుతో ఉరివేసి వారు చనిపోయాక కూతురును నేలపై ఒక గదిలో, కుమారుడిని మంచంపై మరో గదిలో వేసి అనంతరం భార్య భర్తలు వేరు వేరు గదుల్లో ఉరివేసుకుని ఈ ఘాతకానికి పాల్పడివుంటారనే అనుమానాలను,అక్కడి పరిస్థితులనుపట్టి తెలుస్తున్నదని పలువురు పేర్కోన్నారు. ఎంతో భవిష్యత్‌ వున్నపిల్లలను సైతం వారి అనాలోచిత చర్యలకు గురిచేయడం సరికాదని, భార్యభర్తలకు మనస్సెలా వచ్చిందని, పిల్లలను వదిలిపెట్టిన బాగుండేదని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఏమైనా పేద కౌలురైతు కుటుంబం అప్పుల భాదతో మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులను కంటతడిపెట్టించ్చింది. కాగా మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement