Friday, April 26, 2024

రక్త కణాలు దానం..

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు పట్టణానికి చెందిన రవళి (11) అనే పాపకు రక్తకణాలు అత్యవసరం కావడంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, సమాజ సేవకుడు కొట్టె నటేశ్వర్‌ ముందుకు వచ్చి రక్త కణాలను దానం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 36 సార్లు రక్తదానం, 9 సార్లు రక్త కణాలను దానం చేశానని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తనిధి కేంద్రాల్లో రక్తనిల్వలు తగ్గిపోతున్నందున అత్యవసరంగా రక్తం అవసరం ఉండేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువతి, యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. అదే విధంగా న్యాయ పరమైన సమస్యలు ఉంటే తనను సంప్రదిస్తే న్యాయ సేవలను ఉచితంగా అందిస్తానని ఆయన పేర్కొన్నారు. రక్త కణాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వెంటనే స్పందించి రక్త కణాలను దానం చేసి తమ పాపను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన నటేశ్వర్‌కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement