Sunday, April 28, 2024

రూ.20 లక్షలతో బతుకమ్మ ఘాట్ పనులు ప్రారంభం

బెల్లంపల్లి, జూన్ 7 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణం 9వ వార్డ్ లో రూ.20 లక్షలతో పట్టణ ప్రగతి నిధులతో నూతనంగా నిర్మించిచనున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్స్ రాములు నాయక్, మధు, చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు శ్రీధర్, మంగమూర్తి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, BRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement