Tuesday, September 19, 2023

Mistery – ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భయం భయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఉదయం చెలరేగడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో ఇంటి మంటలు చెలరేగాయి దీంతో ఇంటిలో వున్న వారు నిప్పును ఆర్పేశారు. ఏదైన షార్ట్‌ షర్య్కూట్‌ అయి ఉంటుందని లైట్‌ తీసుకున్న కుటుంబ సభ్యులకు మరోరోజు కూడా అంతకుముందు రోజు ఎక్కడైతే మంటలు చలరేగాయో మళ్లీ అక్కడే మంటలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌ కు గురయ్యారు. నాలుగు రోజులుగా మంటలు చెలరేగుతుండంతో ఇక కుటుంబ సభ్యుల్లో భయం మొదలైంది. భయంతో బిక్కు బిక్కు మంటూ ఇంట్లో గడుపుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement