Saturday, May 8, 2021

అక్రమంగా ఇసుక తరలింపు..

మంచిర్యాల : జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేలాల గ్రామ శివారులో గల గోదావరినది నుండి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జైపూర్‌ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్దరాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడి చేసి నాలుగు ట్రాక్టర్లను, నిందితులను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గూడూరు శ్రీనివాస్‌, బాలయ్య, మాసినేని రాజు, వేముల తిరుపతిలు పట్టుబడగా వీరిపై కేసు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఏఎస్సై అజీజ్‌, కానిస్టేబుల్‌ సుబ్బారావు, మోసిన్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News