Thursday, April 25, 2024

శంకర్ చరణ్ సినిమాకు కిచ్చా గ్రీన్ సిగ్నల్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక వీటి తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ని తీసుకునేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.

అలాగే కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ను తీసుకోవాలని భావించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ పాత్రకు సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తన పాత్రకు సంబంధించి నరేషన్ వినిపించగా సుధీప్ వెంటనే ఓకే చెప్పాడట. కాగా ఈ విషయం పై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement