Saturday, October 12, 2024

TS | ఆ మూడు నియోజకవర్గాల్లో అదనపు బ్యాలెట్లు.. అభ్యర్దుల సంఖ్య దాటినందుకే

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: శాసన సభ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్దుల సంఖ్య పెరగడంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ త ూర్పు, నర్సంపేట, హనుమకొండ జి ల్లాలోని పరకాల నియోజకవర్గంలో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లు ఎన్నికల్లో వి నియోగించనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కేవలం నోటా కోసమే అదనపు బ్యాలెట్‌ యూనిట్‌ ఉపయోగించాల్సిన పిం స్థితి ఏర్పడింది.

వరంగల్‌ తూర్పులో 29, నర్సంపేటలో 16, పరకాలలో 28 మంది అభ్యర్దులు పోటీలో నిలిచారు. ఉపసంహరణ అనంతరం గురువారం వారికి గుర్తులు కేటాయించారు. అయితే ఒక్కోఈవిఎం యూనిట్‌లో 16 గుర్తులకు మాత్రమే చోటు ఉంటుంది. అంతకు మించితే మరో యూనిట్‌ను దానికి జతచేస్తారు. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో వినూత్న పరిస్థితి ఉత్పన్నమైంది. అక్కడ 16 మంది మాత్రమే ప్రస్తుతం పోటీలో నిలిచారు.

- Advertisement -

వారికి ఒక్కో యూనిట్‌ బ్యాలెట్‌ సరిపోతుంది. అయితే నోటా కోసం అదనపు బ్యాలెట్‌ను ఉపయోగించకతప్పడం లేదు. బ్యాలెట్‌ యూనిట్‌లో 16 గుర్తులు మాత్రమే సరిపోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నోటా తప్పనిసరి అయినందున కేవలం నోటా కోసమైన నర్సంపేటలో అదనపు బ్యాలెట్లను ఉపయోగించనున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 29 మంది ఉన్నందున అక్కడ 2 బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించనున్నారు.

అదేవిధంగా పరకాలలో 28 మంది రంగంలోదిగడంతో అక్కడ కూడా రెండో బ్యాలెట్‌ తప్పనిసరి అయింది. ఒక్కో యూనిట్‌లో కేవలం 16 గుర్తులకు మాత్రమే పొందుపరిచే అవకాశం ఉన్నందున అంతకు మించి ఒక ్కరు పోటీలో ఉన్న వారికోసం రెండో బ్యాలెట్‌ యూనిట్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండుబ్యాలెట్‌ యూనిట్లు ఉన్నందునఅటు ఓటర్లకు, ఇటు అభ్యర్దులకు కూడా ఇబ్బందులు తప్పడంలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement