Tuesday, October 8, 2024

Congress Manifesto | రేపే కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. విడుదల చేయనున్న ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) విడుదల చేయనుంది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు (ఏఐసీసీ) మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఇక్కడి గాంధీభవన్‌ లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యక కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు గ్యారంటీలకు అనుబంధంగా తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో పొందుపర్చారు.

ధరణిని తీసేసి, దాని స్థానంలో భూమాత (గతంలో భూ భారతి) పోర్టల్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయితీ వార్డు సభ్యులకు గౌరవ వేతనం చెల్లింపు రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్‌ చెల్లించే హామీ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి తో విచారణ హామీతో పాటు టీచర్ల ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించనుంది. అమ్మ హస్తం పేరుతో తొమ్మిది నిత్యావసర వస్తువుల పంపిణీ చేయనున్నట్టు ప్రకటించనుంది. పాత్రికేయుల సంక్షేమానికి మీడియా కమీషన్‌ ఏర్పాటు మెట్రోరైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించనుంది.

మేనిఫెస్టోలో ఇవ్వనున్న హామిలివే !

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
పారదర్శకంగా నియామక ప్రక్రియ
విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్‌నెట్‌ సదుపాయం
బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపులు
మధ్యా#హ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం
మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలల పున: ప్రారంభం
కొత్తగా 4 ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు
ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి.. మెరుగైన వైద్య సేవలు
ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
భూ #హక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు
పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి #హక్కులు
సర్పంచుల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల జమ
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏల చెల్లింపు
సీపీఎస్‌ రద్దు దాని స్థానంలో ఓపీఎస్‌
అమల్లోకి కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. 6 నెలల్లో అమలు
సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజా దర్బార్‌’ నిర్వ#హణ
తెలంగాణ ఉద్యమవీరుల కుటుంబాలకు నెలవారీ గౌరవ పింఛను
ఉద్యమ అమరవీరుల కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛను
ఉద్యమ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేత
ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ
రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పంపిణీ
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం అమలు
దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ
గ్రామ పంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మత్తుల బాధ్యతలు
చెరువుల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు తగినన్ని నిధులు
మెగా డీఎస్సీని ప్రకటించి.. 6 నెలల్లో ఖాళీ టీచర్‌ పోస్టుల భర్తీ

ఇవి కాకుండా..

- Advertisement -

సిటిజన్‌ చార్ట్‌కి చట్టబద్దత, ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్‌, పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం, తెల్ల రేషన్‌ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ, అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ, ఆర్‌ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనం, వార్డు సభ్యులు గౌరవ వేతనం, ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌
ట్రాన్స్‌ జెండర్లకు ఆటోలు, ప్రత్యేక సంక్షేమ పథకాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement