Thursday, December 9, 2021

రెండు ఎకరాల భూమి కొన్న అల్లు అర్జున్.. ఎక్కడో తెలుసా?

సినిమా నటులు తమ సంపాదనతో వివిధ రంగాలపై పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో కొందరు భూములను కొంటున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ చోట భూములు కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో అల్లు అర్జున్ సందడి చేశారు. జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ కొరకు శంకర్ పల్లి తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎమ్మార్వో సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. బన్నీ కార్యాలయానికి వచ్చిన తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా చేరుకున్నారు. బన్నీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తాహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది సైతం బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఫ‌స‌ల్ బీమాతో లాభం లేదు: కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News