Sunday, April 28, 2024

TS: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేయడం ఇప్పుడు కలకలం రేపాయి. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగడం గమనార్హం. అమీర్ పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ తనిఖీలను చేపట్టింది.

హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివ బాలకృష్ణ పనిచేశారు. ఆదాయం మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో శివరామకృష్ణ, ఇళ్లు, ఆఫీసు, బంధువులు ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. పదవిని అడ్డుపెట్టుకుని శివ బాలకృష్ణ రూ.కోట్లలో సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement