Tuesday, May 7, 2024

అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద యాక్సిడెంట్‌.. యువకుడి మృతి

Road Accident: హైదరాబాద్‌ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద యాక్సిడెంట్‌ జరిగింది. ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో 65 నెంబ‌ర్‌ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్‌ పైనుంచి ఇద్దరు యువకులు కింద పడిపోయారు. అయితే వెనుకనే వస్తున్న లారీ ఓ యువకుని తలపైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే చ‌నిపోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వ‌చ్చి క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement