Monday, April 29, 2024

Ayodhya Special Train: ఇవాళ కాజీపేట నుంచి ఆస్తాకు ప్రత్యేక రైలు…

అయోధ్య బలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ ఏర్పాట్లు క‌ల్పించింది. ఇందుకోసం ఇవాళ కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాజీపేట నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరుతుంది.

గత నెల 30న బయలుదేరాల్సిన ఆస్తా ప్రత్యేక రైలు సాంకేతిక కారణాలతో రద్దయింది. మళ్లీ ఈ రైలు పాత ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాజీపేట నుండి రైలు నెం. 07223 జనవరి 30, ఫిబ్రవరి 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది. అయోధ్య నుండి కాజీపేట వరకు నడుస్తుంది. ఫిబ్రవరి 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది. కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరిన రైలు మరుసటి రోజు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్యలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.02 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఈ రైలు పెద్దపల్లి మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, జుజర్‌పూర్, ఇటార్సీ, భూపాల్, బీనా, విరంగన, ఝాన్సీ, ఒరై, ఖాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్ కోచ్‌లు, 2 జనరల్ బోగీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement