Sunday, May 5, 2024

RR : రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

శంషాబాద్, (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని పెద్ద షాపూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండల పరిధిలోని అల్లికోలి తాండ గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement