Saturday, April 27, 2024

TS: తొమ్మిదేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారం

ఆర్మూర్, అక్టోబర్ 24; ప్రభ న్యూస్ : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలోని ఓ మేజర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన విశ్వాసనీయ సమాచారం ప్రకారం… ఆలూరు మండలంలోని ఓ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నివాసముండే 9సంవత్సరాల చిన్నారిపై, కోయ వెంకటేష్ అనే వ్యక్తి ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దుర్ఘటనను గమనించిన మరో చిన్నారి కేకలు వేయడంతో సంఘటన స్థలం నుండి నిందితుడు పరారై స్థానికులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నట్టు సమాచారం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు రావడంతో, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement