Saturday, May 4, 2024

కొంచెం లేట్​, అయినా అనుమతించని అధికారులు.. అభ్య‌ర్థుల కన్నీళ్లు!

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్​) ప్రారంభమైంది. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఈనెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, సంగారెడ్డిలో పలు కేంద్రాల్లో ఆలస్యంగా హాజరైన అభ్యర్థులను అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు. శాంతినగర్ లోని సెయింట్ ఆంథోనీ స్కూల్ లో టెట్ పరీక్షకు 3 నిముషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమ‌తించ‌లేదు..

శాంతిన‌గ‌ర్‌లో అభ్యర్థి రమాదేవి ఎంత బ‌తిమిలాడినా అధికారులు లోపలికి అనుమతించక పోవడంతో.. గేటు వద్ద నిరాశతో కొంత సేపు ఎదురుచూసి వెనుదిరిగింది. పటాన్‌చెరు సెయింట్ జోసఫ్ హైస్కూల్లో టెట్‌ పరీక్ష రాసేందుకు దీప్తి అనే అమ్మాయి 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చిన కారణంగా అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకి అనుమతివ్వలేదు. దీంతో అభ్య‌ర్థులు క‌న్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగారు. ఇంత‌కాలం ప‌రీక్ష కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డామ‌ని, ఇప్పుడు ట్రాఫిక్ స‌మ‌స్య కార‌ణంగా ఆల‌స్య‌మైనందుకు రాయ‌కుండా చేశార‌ని ఆక్రోశం వెళిబుచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement