Saturday, September 7, 2024

Hyderabad: బైక్ ఢీకొని బస్సు దగ్ధం.. వ్య‌క్తి మృతి

బస్సును బైక్‌ ఢీ కొట్టడంతో బస్సు పూర్తి దగ్ధమవడంతో పాటు ఓ వ్యక్తి మృతిచెందిన ఘ‌ట‌న‌ తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శామీర్‌పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ (26).. యూజే ఫార్ములా కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఇవాళ‌ ఉదయం విధుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సంపత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించి బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement