Sunday, April 28, 2024

వలలో చిక్కిన 25 కిలోల చేప..మనోడికి పండగే

స్టేషన్ ఘన్ పూర్ జూలై 21: మాములుగా అయితే చిన్నపాటి జలాశయంలో, చెరువుల్లో 5నుంచి 15 కిలోల వరకు బరువు ఉన్న చేపలు దొరకడమే చాలా అరుదు. ఇది ఆషామాషీ చేప కాదు. ఎన్నాళ్లు పెరిగిందో తెలీదుగానీ.. ఏకంగా 25 కేజీల బరువు ఉన్న చేప దొరికితే? చేపలు పట్టే మత్స్యకారుల్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వారు ఎగిరి గంతేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ మాత్రం ఊహించని రీతిలో భారీ చేప దొరికింది. భారీ చేప వలకు చెక్కిడంతో మత్స్యకారులకు కాసుల పంట పండింది..ఇది ఎక్కడో కాదు..జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి-ఘన్ పూర్ మధ్యలోని వాగులో ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది.

ఈ వాగులో శుక్రవారం ఉదయం మత్స్యకారుడు అలుగు రాకేష్ చేపల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు విసిరిన వలలో 25 కిలోల చేప చిక్కింది. అది చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.వలకు చిక్కిన భారీ చేపను చూసి మురిసిపోయాడు. ఆ భారీ చేపను చేతిలో పట్టుకుని అక్కడ ఉన్న వారందరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.. మరొకరు తన భుజంపై పట్టుకుని బాహుబలి మాదిరిగా ఫోజులు ఇచ్చాడు. ఈ భారీ చేప వలకు చిక్కడంతో విషయం తెలువడంతో చుట్టూ పక్కన ఉన్నవాళ్లు ఆ చేపను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.చాలా మంది ప్రజలు వాగు వద్దకు ఆ చేపను చూసేందుకు వచ్చారు.ఇంత పెద్ద చేప దొరకడం చాలా సంతోషంగా ఉందని రాకేష్ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement