Friday, April 26, 2024

అగ్నిప్రమాద బాధితులకు పాతిక లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి.. మాజీ ఎంపీ వీహెచ్ సంతాపం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన కూలీల కుటుంబాలకు పాతిక లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 11 మంది కూలీలు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల పరిహారం వారి కుటుంబాలకు ఏమాత్రం సరిపోదని, దాన్ని పాతిక లక్షలకు పెంచాలని వీహెచ్ నొక్కి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా 5 లక్షలు ఇచ్చి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులలో పని చేస్తున్న బీహార్ కూలీల శ్రమ వెలకట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఆయా రాష్ట్రాలకు చందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకు వచ్చి ఆదుకోవాలని సూచించారు. రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పధంతో ఆలోచించి ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వి.హనుమంతరావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement