Tuesday, May 7, 2024

Ts: నేడు పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు ఇవాళ‌ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్‌ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

- Advertisement -

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..మార్చి 18: ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్( హిందీ)మార్చి 21: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)మార్చి 23: మ్యాథమెటిక్స్మార్చి 26: సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)మార్చి 28: సైన్స్ పేపర్ -2(బయాలజీ)మార్చి 30: సోషల్ స్టడీస్ఏప్రిల్ 1: ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌),ఏప్రిల్ 2: ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)

కాగా, ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement