Saturday, December 7, 2024

Nirmal : ఆశ్రమ పాఠశాలలో 10మంది విద్యార్థులకు అస్వస్థత..

నిర్మల్ టౌన్, ఆగస్టు 25, (ప్రభ న్యూస్) : నిర్మల్ లోని రాంనగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎం డీ ఏ టాబ్లెట్లు వికటించి పది మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు డాక్టర్ లు తెలిపారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి వారి బంధువులు, తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. ఈసందర్భంగా ఆశ్రమ పాఠశాలను స్థానిక పోలీసులు సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement