Saturday, May 4, 2024

Controversial Comments మాధవ రెడ్డి మహనీయుడు, ఆయన కొడుకు బచ్చా – మంత్రి కోమటిరెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మంచి పేరు తెచ్చుకున్న స్వర్గీయ , మాజీ మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి మహనీయుడని, ఆయన కొడుకు మాత్రం ఒక బచ్చా అంటూ, కనీసం వార్డు సభ్యుడిగా గెలవలేడని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం యదాద్రిభువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

అనతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ , రైతుల పట్ల మంత్రి వెంకట్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే లేచి మాజీ మంత్రి మాధవరెడ్డి మహానీయుడని, ఆయన కొడుకు బచ్చా అంటూ కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేక పోవడం,నేడు అతను విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. మంత్రిని విమర్శించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా జడ్పీ చైర్మన్ పైకి వెళ్లడంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది జడ్పీ చైర్మన్ స్టేజ్ పైనుంచి పంపించేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement