Tuesday, June 18, 2024

Encounter – కాలిగోటికి స‌రిపోని వాడే మిమ్మ‌ల్ని ఫామ్ హౌజ్ లో పండ‌బెట్టాడు …కెటిర్ కు మంత్రి కోమ‌టిరెడ్డి ఝ‌ల‌క్

యాదాద్రి – కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడని ఎమ్మెల్యే కేటీఆర్ కు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. యాదాద్రి జిల్లా పర్యటించిన ఆయన కేటీఆర్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్యాల‌కు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు గోటికి రేవంత్ రెడ్డి సరిపోడ‌ని అంటావా? అంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహాదేవపూర్ లో వేణుగోపాలస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయ‌న కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే, మిమ్మల్ని తొక్కితే 50 వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు అది గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు.

జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి అంచలంచలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. నువ్వు కేసీఆర్ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని విమర్శించారు. రేవంత్ రెడ్డి చిటికెనా వేలుకు కూడా సరిపోవంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కేటీఆర్ బాషా మార్చుకోవాలని, ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు.. మీరెప్పుడైనా మాట్లాడారా? ప్రశ్నించారు. కొండమాడుగు లో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement