Thursday, April 25, 2024

సింహాల‌కి క‌రోనా – సిబ్బంది ద్వారా వ్యాప్తి

క‌రోనా క‌ల క‌లం మామూలుగా లేదు. రోజు రోజుకి కేసులు కూడా అధిక‌మ‌వుతున్నాయి. ఈ వైర‌స్ మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కి సోకుతోంది. ద‌క్షిణాఫ్రికా రాజ‌ధాని ప్రిటోరియాలోని జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో ఉన్న సింహాలు, ప్యూమాల‌కు అక్క‌డి సిబ్బంది నుంచి క‌రోనా సోకింది. కాగా కరోనా సోకిన 23 రోజుల తర్వాత అవి కోలుకున్నాయని అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.ఇప్ప‌టి వ‌ర‌కు జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. మనుషుల నుంచి కూడా.. జంతువులకు కరోనా సోకుతుందని ఈ ఘటనతో రుజువైందని అక్కడి అధికారులు వెల్ల‌డించారు. సింహాలు వ్యాధిబారిన పడినట్లు గుర్తించిన తర్వాత.. సిబ్బంది కారణంగానే.. వాటికి వైరస్ సోకినట్లు తేలిందని అధికారులు చెప్పారు. వాటి నుంచి.. ఇతరులకు కూడా సోకే అవకాశం ఉందన్నారు. సింహాలకు ఆహారం వేసేటప్పడు.. వాటి వద్దకు వెళ్లే సమయంలోనూ మాస్క్ లు, గ్లౌజులు ధరించాలి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా.. జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement