Thursday, April 25, 2024

Breaking: ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి బుధవారం ఎమ్మెల్సీలు గా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రి వారితో శాసన మండలి ఛైర్మన్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డి కి మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడీ కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement