Wednesday, May 1, 2024

కాన్పూర్ లో జికా వైర‌స్ క‌ల క‌లం..123కేసులు న‌మోదు..

క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌టే..ప‌లు ర‌కాల వైర‌స్ లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కాగా జికా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక్క కాన్పూర్‌ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 96 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో మూడు కేసులు లక్నోలో, ఒక కేసు కన్నౌజ్‌లో నమోదయిందని వెల్లడించారు. వైరస్‌ ఎలా, ఎవరి వల్ల వ్యాప్తి చెందిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు.కాన్పూర్‌లో మొదటి జికా వైరస్‌ కేసు అక్టోబర్‌ 23న నమోదయింది. నగరంలో తొలిసారిగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన వారెంట్‌ ఆఫీసర్‌లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, గత కొన్ని వారాలుగా జికా వైరస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement