Monday, April 29, 2024

పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ నుండి మ‌రో హీరో – ప‌రిచ‌యం చేయ‌నున్న హోంబ‌లే

దివంగ‌త క‌న్న‌డ స్టార్ న‌టుడు పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ నుండి మ‌రో హీరో ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నారు. దివంగత లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ బాధ్యతను తీసుకున్నారు హోంబ‌లే ఫిల్మ్స్ వారు.పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ను వెండితెరకు పరిచయం చేయబోతోంది హోంబలే ఫిల్మ్స్. ఈ మేరకు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఆసక్తికర పోస్టర్‌లను విడుదల చేస్తూ, “ది లెగసీ కంటిన్యూస్” అంటూ రాసుకొచ్చారు. పునీత్ ‘యువరత్న’తో సహా పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ ఆనంద్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. ఈ సినిమాను నిర్మించి, దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement