Monday, April 29, 2024

YS Sharmila: రైతుబంధు వారోత్సవాల సాక్షిగా.. రైతులు బలి కనపడుతుందా దొరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జాతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేతలు సీతారాం ఏచూరి, రాజా తదితరులను సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా అంటూ మండిపడ్డారు. ‘’మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి, దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు. మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతుందా దొరా? పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి.’’ అని షర్మిల పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement