Thursday, April 25, 2024

నైరుతి బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ద్రోణి – తెలంగాణ‌లో ప‌లు చోట్ల వ‌ర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ద్రోణి నెల‌కొంది.స‌ముద్ర‌మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ద్రోణి నెల‌కొంది. ఈ మేర‌కు ఉత్త‌ర‌,ద‌క్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావ‌రి జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. కాగా మ‌రోప‌క్క తెలంగాణ‌లో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన హైదరాబాద్ వాతారవణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement