Thursday, April 18, 2024

ప్రతి పోలీస్ అధికారి బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలి : డా.తరుణ్ జోషి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందితో పాటు హోంగార్డ్ సిబ్బంది కూడా తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాలు జారీ చేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బూస్టర్ డోస్ టీకా అందించేందుకు గానూ కమిషనరేట్ కార్యాలయంలో రాణి రుద్రమ దేవి సమావేశ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని పోలీస్ కమిషనర్ బుధవారం అధికారులతో సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందిస్తున్న బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీరును పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి బూస్టర్ డోస్ టీకా తీసుకోనే విధంగా వివిధ విభాగాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం స్థానిక ఆరోగ్య కేంద్రం ద్వారా బూస్టర్ డోస్ టీకా తీసుకోనే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులు చొరవ చూపించాలన్నారు.

అదే విధంగా ఈ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ సంబంధించి డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వుంటుందని, అలాగే ఏసీపీ స్థాయి అధికారులు డివిజన్ పరిధిలో నూరు శాతం బూస్టర్ డోస్ వాక్సినేషన్ అయ్యే విధంగా సంబంధిత వైద్యాధికారులతో కలిసి పనిచేయాలని సూచించడంతో పాటు ప్రతి పోలీస్ తప్పని సరిగా మాస్కు ధరించడంతో పాటు, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అంతకు ముందు ఈ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయి చైతన్య అధికారులతో కలిసి ప్రారంభించడంతో పాటు, అదనపు డీసీపీ సాయిచైతన్యతో పాటు పరిపాల విభాగం అదనపు డీసీపీ వైభర్ గైక్వాడ్, ఏఆర్ అదనపు డీసీపీ భీంరావులు స్వయంగా బూస్టర్ డోస్ టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సాయి చైతన్య, వైభవ్ గైక్వాడ్, సంజీవ్, ఏసీపీలు శ్రీనివాస్, సత్యనారయణ, ఆర్.ఐలు శ్రీనివాస్ రావు, ఉదయ భాస్కర్, హతిరాం, నగేష్, భాస్కర్, సుబేదారి ఇన్ స్పెక్ట‌ర్ రాఘవేందర్, యూనిట్ డాక్టర్లు విజయ్ కుమార్, విద్య‌, డి.యం.హెచ్.ఓ డాక్టర్ సౌజన్యతో పాటు ఇతర వైద్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement