Monday, April 29, 2024

Omicron: యంగ్ ఏజ్ వాళ్లనే ఒమిక్రాన్ అటాక్ చేసింది.. ఎక్కువగా44 ఏళ్ల లోపు వారే:ICMR వెల్లడి

దేశంలో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతోందని, ఒమిక్రాన్ వేగంగా వ్యాపించినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.  అంతేకాకుండా ఈ థర్డ్ వేవ్ లో కూడా వైరస్ బారిన పడ్డవారిలో ఎక్కువగా మిడిల్ ఏజ్ వారే ఉన్నారన్నారు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ . వారిలోనూ చాలా మందిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం వల్లనే వైరస్ అటాక్ అయ్యిందని,  అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే తీసుకోని వారే  ఎక్కువ ప్రమాదంలో ఉన్నారన్నారు. ఈ వేరియంట్ సోకడం ద్వారా మరణాల సంఖ్య కూడా చాలా తక్కువే ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయన్నారు.

దేశంలో కరోనా వైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యప్తిస్తోంది. అదేవిధంగా ఈ వేరియంట్ ఎక్కువగా 44 ఏళ్ల వారికే ఎక్కువగా అటాక్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థ వర్గాలే ధ్రువీకరనిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్ -19 మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ లలో సోకిన వారి సగటు వయస్సు 55 సంవత్సరాలు. కాగా, థర్డ్ వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరే వారి సగటు వయస్సు 44కి చేరినట్టు తెలుస్తోంది.

మేము అధ్యయనం చేసిన దాని ప్రకారం ఈ రెండు వేవ్ ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పోల్చి చూశాం. ఒకటి నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు.. ఇది డెల్టా వేరియంట్ ను సూచిస్తుంది. మరొకటి డిసెంబరు 16 నుండి జనవరి 17 వరకు.. ఈ టైమ్ లో ఎక్కువగా ఒమిక్రాన్ సోకింది అని ICMR డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.  హాస్పిటల్ లో చేరిన 1,520 మంది వ్యక్తులనుంచి ఈ డేటా సేకరించినట్టు తెలిపారు. వారందరినీ రిపోర్టులను అనలైజ్ చేయగా ఇదే తేలిందన్నారు. థర్డ్ వేవ్ విస్తృతంగా ప్రబలుతున్న సమయంలో వారి సగటు వయస్సు 44 సంవత్సరాలుగా ఉందన్నారు.  వీరిలో సుమారు 46శాతం మందికి ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని, అంతేకాకుండా వీరు తక్కువ ఏజ్ వారు కావడం గమనించాల్సిన విషయమన్నారు డాక్టర్ భార్గవ.  

ICMR Director General Doctor Balaram Bhargava

దేశంలో ఇప్పుడు తగ్గిపోతున్నట్టు భావిస్తున్న మూడవ వేవ్.. భారీ సంఖ్యలో మరణాలకు కారణమైన మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ కంటే  చాలా ఢిఫరెంట్ గా ఉందని,  ఈసారి టీకాలు తీసుకున్న వారిలో చాలా మంది మృత్యువు నుంచి బయటపడ్డారని, అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలా తక్కు సంఖ్యలో మరణాలు సంభవించాయన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా కొంతమంది కరోనా బారిన పడి చనిపోయారని.. దేశ వ్యాప్తంగా ఇట్లాంటి వారు10శాతం మేర ఉంటారని,  కాగా, టీకాలు తీసుకోకుండా కరోనా బారిన పడిన వారిలో 22 శాతం మంది చనిపోయినట్టు రికార్డులు తెలియజేస్తున్నాయన్నారు. అంతేకాకుండా టీకాలు తీసుకున్న వారిలో మరణాలు సంభవించినట్లయితే 10 మందిలో 9 మందికి ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నాయని డాక్టర్ భార్గవ ఎత్తి చూపారు. టీకాలు వేయని వారిలో 83 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయన్నారు.

ఈసారి కొవిడ్ చికిత్స కోసం ఔషధాల వినియోగం చాలా తక్కువగా ఉందన్న వాస్తవాన్ని కూడా ICMR నివేదిక హైలైట్ చేసింది. అంతేకాకుండా మూత్రపిండాల వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS), తదితరాలు వంటి తక్కువ సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.  ఆసుపత్రిలో చేరిన రోగులలో అన్ని కొవిడ్-19 లక్షణాలు తక్కువ నిష్పత్తిలో ఉన్నాయని కూడా డేటా చూపించింది. జనవరి టైమ్లో యువ జనాభాలో ఎక్కువగా కనిపించే ప్రధాన లక్షణం గొంతు నొప్పి మాత్రమేనని చెప్పుకొచ్చారు ICMR డీజీ డాక్టర్ బలరాం భార్గవ.

Advertisement

తాజా వార్తలు

Advertisement