Thursday, April 25, 2024

Breaking : జిల్లా కేంద్రం కోసం రాజీనామాకు సిద్ధం – బాల‌కృష్ణ‌

జిల్లా కేంద్రం కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌ని తెలిపారు ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ‌. హిందూపురంలో అన్ని వ‌స‌తులు ఉన్నాయ‌న్నారు. రాత్రికి రాత్రి జిల్లాల‌ను ప్ర‌క‌టించార‌ని మండిప‌డ్డారు. ఇది ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక అన్నారు. ఇక్క‌డున్న ఎంపీ గోరంట్ల మాధ‌వ్ క‌నిపించ‌డం లేద‌ని బాల‌య్య ఎద్దేవా చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం బాల‌కృష్ణ నిర‌స‌న చేప‌ట్టారు.హిందూపురంలో బాల‌కృష్ణ మౌన‌దీక్ష‌ని చేప‌ట్టారు. జిల్లాకు స‌త్య‌సాయి పేరుపెట్టి ..జిల్లా కేంద్రాన్ని మాత్రం హిందూపురాన్నే పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement