Friday, May 3, 2024

FLASH: వాట్సాప్ స్టేటస్‌లో ఫొటో పెట్టిన యువకుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

తనతో కలిసి దిగిన ఫొటోను యువకుడు తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన అమ్మాయి (17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అవి చూసిన యువతి తల్లిదండ్రులు ఆ ఫొటోలను స్టేటస్ నుంచి తొలగించాలని యువకుడిని కోరారు. అయినప్పటికీ అతడు వాటిని తొలగించలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement