Thursday, May 2, 2024

Monsoon | స్పీడందుకున్న నైరుతి.. కేరళకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్​ జారీ

కేరళలో నైరుతి రుతుపవనాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. తిరువనంతపురంలోని భారత వాతావరణ విభాగం (IMD) శనివారం సాయంత్రం వెదర్​ అప్​డేట్​ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రేపు (ఆదివారం) ఎల్లో అలర్ట్​ని జారీ చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇప్పటికే కేరళను దాటి ఏపీ, తెలంగాణకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు అరేబియాలో ఏర్పడ్డ అల్పపీడనం, తుపాను కారణంగా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. కాగా బిపార్జాయ్​ తుపాను తీరం దాటడంతో నైరుతి రుతుపవనాల్లో వేగం కనిపిస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, రేపు కేరళలోని పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం అలప్పుజా, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్‌లకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

జూన్ 20వ తేదీ, 21 తేదీలలో కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత వారంలో కొల్లం, పతనంతిట్టల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువగానే ఉంది. జూన్ 17వ తేదీ వరకు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు 60% తక్కువగా ఉన్నాయి. ఇది పెద్ద లోటు కిందకు వస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక.. జూన్ 8 న ప్రారంభమైనప్పటి నుండి రుతుపవనాలు కేరళలో బలహీనమైన దశలో ఉన్నాయి, ఇది తుఫాను బిపార్జోయ్ ప్రభావంగా తెలుస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement