Sunday, April 28, 2024

CWG: భళా భజరంగీ.. పసిడి పతకంతో మెరిసిన భారత స్టార్​ రెజ్లర్​

భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా మరోసారి సత్తాచాటాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారీ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్‌ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను ఫైనల్‌లో 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్‌.. 2018లో వేల్స్‌కు చెందిన కేన్‌ చారిగ్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్‌ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement