Monday, April 29, 2024

వావ్‌, బ్యూటిఫుల్ పిక్‌.. ఇదెక్క‌డి ఫొటోనో చెప్పుకోండి..

ఇంగ్లిష్ మూవీస్‌లో వ‌చ్చే అద్భుత సీన‌రీ లెక్క ఉన్న ఈ ఫొటో ఎక్క‌డిదో తెలుసా.. జేమ్స్ బాండ్ మూవీస్‌లో అంత‌ర్జాతీయంగా ఉన్న బ్యూటీఫుల్ సిటీస్ ని విజువైలైజ్ చేసుకోండి.. మీకెక్క‌డైనా ఇట్లాంటిది చూసిన‌ట్టు యాదికొచ్చిందా.. టామ్ క్రూస్ హీరోగా న‌టించిన మిష‌న్ ఇంపాజిబుల్ మూవీస్‌లో కానీ చూశారేమో మ‌న‌నం చేసుకోండి.. ఇంకా గుర్తుకు రాలేదా..

అయితే ఇట్లాంటి సీన్ మీరెప్పుడూ చూసి ఉండ‌ర‌నుకుంటా.. ఎందుకంటే ఇది హైద‌రాబాద్‌కు సంబంధించిన‌ బ్యూటిఫుల్ ఇమేజ్‌.. హైద‌రాబాద్ అంటే వ‌ర‌ద‌లప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు, మునిగిపోయిన ఇండ్లు, న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బందిగా ఉండే రోడ్లు.. అడుగుకో గుంత వంటి ప‌రిస్థితులు చాలా ఉండేవి.. అట్లాంటివ‌న్నీ ఇప్పుడు ఒక్కొక్క‌టీ మాయం అవుతున్నాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నుల‌తో హైద‌రాబాద్ సిటీ మ‌రింత స్మార్ట్‌గా మారుతోంది.. వ‌రల్డ్‌ బ్యూటిఫుల్ సిటీగా మారేందుకు మెరుగులు దిద్డుకుంటోంది.. క‌ళ్లు చెదిరేలా ఉన్న ఈ ఫొటో మాత్రం.. త్వ‌ర‌లో ప్రారంభంకానున్న షేక్ పేట ఫ్లై ఓవ‌ర్ కు సంబంధించిన నైట్ విజువ‌ల్.. చాలా బాగుంది క‌దా.. కొత్త సంవ‌త్స‌రంలో ప్రారంభానికి రెడీ అవుతుంటే.. ఓ దోస్తు ఇలా క్లిక్ మ‌నిపించి షేర్ చేశాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement