Wednesday, May 15, 2024

MBNR : పదేళ్ల నిజానికి… వందరోజుల అబద్దానికి మధ్య యుద్ధం…ఎంపీ అభ్యర్థి ప్ర‌వీణ్‌కుమార్

గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 29 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల నిజానికి వందరోజుల అబద్దానికి జరుగుతున్న ఈ యుధ్ధంలో తెలంగాణ సంక్షేమ కోసం కృషి చేస్తున్న నాయకుడు కేసీఆర్ తో కలిసి ప్రయాణించాలని ఎంపీ అభ్యర్థి ప్రవీణ్​కుమార్​ కోరారు. గద్వాల జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండో స్టేడియంలో, వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలో అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగిందన్నారు. వంద రోజుల్లోనే రైతులకు డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదు కానీ రైతుబంధు కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదన్నారు. కానీ మరి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు కొత్తగా ఆగస్టు 15 లోపు రైతులకు 2లక్ష రుణమాఫీ చేస్తానని దేవుళ్ళ పైన ఒట్టు వేస్తూ ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం దేవుళ్ల పైన ఒట్టు వేస్తూ ప్రజలకు రైతులకు మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రజలకు మసిపూసి మారేడు కాయలు దేవుళ్లను వాడుకుంటూ ప్రజలకు మరొక్కసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారన్నారు. ప్రజలారా ఈ విషయాన్ని రైతులు ప్రజలు ప్రతి ఒక్కరు గ్రహించాలని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మరొక్కసారి 50 ఏళ్ల పాలన మళ్లీ పూర్వ పాలన రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి సాధ్యం కావాలంటే పార్లమెంటులో మీ గొంతు గా నన్ను ఆశీర్వదించండన్నారు. త్వరలో జరగబోయే మే 13వ తేదీ నాడు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఈ పదేళ్లపాటు ఏలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు 24 గంటల కరెంటు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడం జరిగింది అనే విధంగా రైతులకు పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రతి చివరి ఆయకట్టు వరకు సాగు నీరును అందించడం జరిగిందన్నారు. రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గర్వంగా చెప్పారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు తిరిగి చూసేలా తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రైతుల గురించి ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు పంటలు ఎండిపోతున్నాయి అని సరైన నీళ్లు కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను రైతులు ఎదుర్కొనే పరిస్థితి నేడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగర్ దొడ్డి వెంకట రాములు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ ఇంతియాజ్, గద్వాల మునిసిపాలిటీ వైఎస్ ఛైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు దౌలు, రామకృష్ణ శెట్టి, రిజ్వాన్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement