Thursday, May 16, 2024

ఆర్ ఆర్ ఆర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – రూ.223కోట్లు – ట్వీట్ చేసిన త‌ర‌ణ్ ఆద‌ర్శ్

ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఓపెనింగ్ రికార్డును తిరగరాసింది. తద్వారా భారతీయ సినీ చరిత్రలో అత్యధికంగా ఓపెనింగ్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం వరల్డ్ వైడ్ తొలిరోజున రూ.223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారత్ లో అత్యధికంగా రూ.156 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఒక్క అమెరికాలోనే రూ.42 కోట్లు రాబట్టింది. అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ఇతర దేశాల్లోనూ మరో రూ.25 కోట్లు వసూలు చేయడం విశేషం. భారత్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తే… ఏపీలో రూ.75 కోట్లు, నైజామ్ లో రూ.27.5 కోట్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.25 కోట్లు, కర్ణాటకలో రూ.14.5 కోట్లు, తమిళనాడులో రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు వసూలు చేసింది. ఈ మేర‌కు ట్వీట్ చేశారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement