Thursday, May 2, 2024

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!?

ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. అయితే, తాజాగా ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారు అని తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ కూడా ముగియడంతో జగన్ మంత్రి వర్గం కూర్పు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని సమాచారం. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ విధమైన పొరపాట్లూ లేకుండా రాజకీయంగా ప్రాంతీయంగా సామాజికవర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటికి పదిసార్లు సమీక్షించుకుని మరీ కొత్త మంత్రులను ఎంపిక చేస్తారు అని తెలుస్తోంది.

మరోవైపు మంత్రి పదవులపై ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఎంపిక సీఎంకు కత్తి మీద సాము వ్యవహారమే అని అంటున్నారు. ఎవరికి పదవి ఇచ్చిన ఎవరిని తప్పించినా అది తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. అందువల్ల ఆచి తూచి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇక ఆశావహులను ఆయన పిలిపించుకుని మాట్లాడి ఏ కారణం చేసిన మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామో తెలియచేస్తారని అంటున్నారు. ఇక, మంత్రి పదవి దక్కని వారికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించి.. అసంతృప్తి లేకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరు, ముగ్గురు మినహా దాదాపు అందరూ మంత్రి పదవులను కోల్పోనున్నారని తెలుస్తోంది. ఇందు సంబంధించి కూడా ఇప్పటికే జగన్ వారికి సంకేతాలు ఇచ్చారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement