Wednesday, May 15, 2024

పిల్లోడు కాదు చిచ్చ‌ర‌పిడుగు – ‘పాము’నే ప‌రుగు పెట్టించాడు

ఐదు అడుగుల పొడ‌వున్న ర‌క్త పింజ‌ర పామును ప‌రుగుపెట్టించాడో బుడ‌త‌డు. ఆ పామంత పొడ‌వు కూడా లేని ఓ చిన్నారి తోక పట్టుకుని ఓ ఆట ఆడించేశాడు. అది ఆ బుడ్డోడి చేతి నుంచి విడిపించుకుని పోదామని ప్రయత్నించినా ఆ చిన్నోడు వదిలితేనా.. ఇంతలో ఇంకో బుడ్డోడొచ్చి దాన్ని పట్టుకునేందుకు పోటీ పడ్డాడు. దీంతో మొదటి చిన్నారి చేతి నుంచి పాము జారింది. అతడి చేతుల్లో నుంచి తుర్రుమని జారుకుంది. అయినా, కూడా ఆ పామును పట్టుకునేందుకు ఆ బుడతడు ఇసుమంతైనా బెదురు, బెరుకూ లేకుండా వెంబడించేశాడు. ఇప్పుడీ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement