Wednesday, May 15, 2024

Women’s World Cup 2022: ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ.. మిథాలీ సేనకు అగ్ని పరీక్ష

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మిథాలీసేన్ బ్యాటింగ్ కు దిగింది. టాప్-4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం మిథాలీ సేనకు తప్పనిసరి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. అందులో రెండు ఓటమి చెందగా మ‌రో రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి నాలుగు పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన మిథాలీ సేన ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలని పట్టుదలతో ఉంది. భారత జట్టులో దీప్తి శర్మ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి వచ్చింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్( కెప్టెన్ ), హర్మన్ ప్రీత్ కౌర్ లతో భారత జట్టు పటిష్టంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement