Wednesday, May 15, 2024

Womens World Cup 2022: భాటియా హాఫ్ సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 230 రన్స్

మహిళల ప్రపంచక‌ప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా హాఫ్ సెంచ‌రీతో అదరగొట్టింది.  హామిల్టన్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 229/7 చేసింది. 50 పరుగులు చేసిన యాస్తికా భాటియా అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన మంచి శుభారంభం ఇచ్చింది. ష‌ఫాలీ, స్మృతిలు ఆరంభంలో స్కోర్ బోర్డును ప‌రుగెత్తించారు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఓపెనింగ్ వికెట్‌కు 74 పరుగులు జోడించి జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. అయితే, బంగ్లాదేశ్ వ‌రుస‌గా మూడు వికెట్ల‌ను తీసింది. స్మృతి, ష‌ఫాలీ, మిథాలీలు వ‌రుస‌గా పెవిలియన్ చేరారు. ఆ త‌ర్వాత హ‌ర్మ‌న్‌ప్రీత్‌, రీచా ఘోష్‌లు కూడా ఓట‌య్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 14(33) పరుగుల వద్ద రనౌట్ కావడంతో పెద్దగా రాణించలేకపోయింది. ఈ క్రమంలో భాటియా నిల‌క‌డ‌గా ఆడుతూ హాఫ్ సెంచ‌రీ చేసింది. స్మృతి 30, ష‌ఫాలీ 42, భాటియా 50 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement