Sunday, May 19, 2024

Women’s World Cup: ఫైనల్ లో ఇంగ్లండ్ కు పరాభవం.. మహిళల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకే

మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా దక్కించుకుంది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ఇంగ్లండ్ ను 71 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా వన్డే వరల్డ్ కప్ ఏడో టైటిల్ ను చేజిక్కించుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. నిర్ణిత 50 ఓవర్లలో ఇంగ్లండ్ కు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేయెన్స్ లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్‌ అలీసా హీలీ భారీ శతకంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. హీలీ138 బంతుల్లోనే 170 పరుగులు చేసింది. ఆమెకు హేయెన్స్ (68 పరుగులు), మూనీ (62 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును నమోదు చేసింది. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆన్య శ్రబ్ సోల్ తప్ప అందరూ ధారాళంగా పరుగులను సమర్పించుకున్నారు. శ్రబ్ సోల్ 10 ఓవర్లు వేసి కేవలం 46 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 43.4 ఓవర్లలో 285 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ స్కీవర్‌ దూకుడుగా ఆడింది. కేవలం 121 బంతుల్లోనే 148 పరుగులు చేసి లక్ష్యం వైపు నడిపించినా ఫలితం దక్కలేదు. నటాలీ స్కీవర్‌ ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు అలానా కింగ్‌ (3), జెస్‌ జోనాస్సెన్‌ (3), మెగాన్‌ షట్‌ (2) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్‌ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకం చేసిన అలీసా హీలీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement